నా కూతురికి రాజకీయాలు తెలియవు: గంగూలీ

నా కూతురికి రాజకీయాలు తెలియవు: గంగూలీ

తన కూతురికి రాజకీయాలు తెలియవన్నారు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. తనను ఈ విషయాల్లోకి లాగొద్దన్నాడు. ప్రస్తుతం పౌరసత్వ సవరణ చట్టం(ACC)పై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. విపక్ష నేతలతో పాటు కొందరు సినీ ప్రముఖులు కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సోషల్‌మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సౌరబ్‌ గంగూలీ కుమార్తె సనా గంగూలీ కూడా ACC పై తన ఇన్‌స్టాగ్రామ్‌ ఓ పోస్టు పెట్టింది. ప్రముఖ రచయిత కుశ్వంత్‌ సింగ్‌ రాసిన ‘ది ఎండ్‌ ఆఫ్‌ ఇండియా’ నవలలోని సారాంశాన్ని పోస్ట్‌ చేసిన సనా.. జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్‌ను, పౌరసత్వ చట్ట సవరణను పరోక్షంగా వ్యతిరేకించారు.

అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సనా పోస్ట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇంత చిన్న వయసులో ఎంతో పరిణతితో ఆలోచించిందని కొందరు ప్రశంసించగా.. మరికొందరు విమర్శలు చేశారు. అయితే దీనిపై స్పందించి గంగూలీ… తన కుమార్తె చేసిన పోస్ట్‌ నిజం కాదని ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అంతేకాదు అమె చిన్న పిల్ల అని.. ఇలాంటి రాజకీయాల గురించి తెలియవని చెప్పారు.