సెహ్వాగ్‌.. నీ తలపై ఉన్న వెంట్రుకల కంటే నా దగ్గరున్న డబ్బే ఎక్కువ: అక్తర్

సెహ్వాగ్‌.. నీ తలపై ఉన్న వెంట్రుకల కంటే నా దగ్గరున్న డబ్బే ఎక్కువ: అక్తర్

'వీరేంద్ర సెహ్వాగ్ vs షోయబ్ అక్తర్..' ఈ తరం యువకులకు వీరి మధ్య పోరు గురుంచి అంతగా తెలిసుండకపోవచ్చు కానీ 90'స్ కిడ్స్‌కు బాగా సుపరిచితం. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో రాకాసి బౌన్సర్లు సంధిస్తూ బ్యాటర్లును ముప్పతిప్పలు పెట్టేవాడు..అక్తర్. అందువల్ల అతని వేగానికి తగ్గట్టుగా 'రావల్పిండి ఎక్సప్రెస్' అని పిలిచేవారు. అలాంటి దిగ్గజ బౌలర్‌ను భయపెట్టిన బ్యాటర్ ఎవరంటే.. సెహ్వాగ్ మాత్రమే. బంతి ఎంత వేగంతో దూసుకొస్తే.. అంతే స్పీడ్‌తో బౌండరీకి తరలించడం వీరేంద్రుడికి అలవాటు. అది అక్తర్‌కు నచ్చేది కాదు.. దీంతో మాటల యుద్ధానికి తెరలేపేవాడు. 

ఒకానొక సందర్భంలో వీరిద్దరి మొదలయ్యే మాటల యుద్ధం కాస్తా తీవ్రస్థాయికి చేరుకునేది. వ్యక్తిగత విమర్శలకు దిగేవారు. కాకుంటే అది సరదాకు మాత్రమే. ఈ విషయాలపై, వీరిద్దరి మధ్య స్నేహంపై సెహ్వాగ్ తాజాగా స్పందించాడు. బ్రేక్ ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ ప్రోగ్రామ్‌కి హాజరైన సెహ్వాగ్‌ను హోస్ట్.. 'ఇండియా, పాక్ ప్లేయర్ల మధ్య ఫ్రెండ్‌షిప్ ఉండేదా?' అని ప్రశ్నించాడు. అందుకు బదులిచ్చిన సెహ్వాగ్ ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 

"ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ పరిహాసం కూడా ఉంటుంది. గొడవలు ఉంటాయి. ఆ స్నేహంలో మజాక్‌లు, తిట్టుకోవడాలు కామన్.  నిజం చెప్పాలంటే.. అక్తర్, నేనూ 2003-04 వరకూ చాలా మంచి స్నేహితులం. మేం రెండు సార్లు పాక్ పర్యటనకు వెళ్లాం.. వాళ్లు ఇక్కడికి రెండు సార్లు వచ్చారు. కానీ ఒక రోజు అక్తర్.. సెహ్వాగ్ నెత్తి మీద ఉన్న జట్టు కంటే నా దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయని కామెంట్ చేశాడు. అందుకు సమాధానం ఇప్పుడు చెబుతున్నా.. 'అక్తర్ నీ దగ్గర ఉన్న నోట్ల కంటే నా నెత్తి మీద జట్టు ఎక్కువగా ఉంది చూసుకో..' అని కామెంట్ చేశాడు.

ఇలా సెహ్వాగ్ ఎందకన్నాడో తెలుసా.. 

2016లో షోయబ్ అక్తర్.. భారత యువ క్రికెటర్లను పొగుడుతూ యూట్యూబ్‌లో వీడియోలు చేయడం మొదలెట్టాడు. అది సెహ్వాగ్‌కు ఎందుకు నచ్చలేదో కానీ అక్తర్ ను విమర్శించాడు. 'మా క్రికెటర్ల సంగతి మాకు తెలుసు, మీ వాళ్లు ఎలా ఆడుతున్నారో చూసుకో.. డబ్బు కోసం ఇంతకు దిగజారుతావా..' అని కామెంట్ చేశాడు. సరైన సమయం కోసం వేచి చూసిన అక్తర్ ఒకరోజు.. 'డబ్బు కోసం చేయట్లేను.. నా దగ్గర నీ నెత్తి మీద వెంట్రుకల (బాల్) కంటే ఎక్కువ డబ్బులు (మాల్) ఉన్నాయి. నాకు ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారని నీకు నచ్చట్లేదు.  అది నాకు అర్థమైంది. నేను ఈ స్థాయికి ఎదగడానికి 15 ఏళ్లు పట్టింది..' అని అక్తర్ రివర్స్ కౌంటర్ ఇచ్చాడు. అందుకు సెహ్వాగ్ తాజాగా కౌంటర్ ఇచ్చాడన్నమాట.