అహింసాయుత ప్రదర్శనలకే నా మద్దతు

అహింసాయుత ప్రదర్శనలకే నా మద్దతు
  • ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ 

పాట్న: అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా బీహార్ లో జరుగుతున్న హింసాత్మక నిరసనలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ట్విట్టర్ వేదికగా ఆదివారం స్పందించారు. బీహార్ లో సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా ఉన్న బీజేపీ, జేడీ యూ మధ్య విభేదాల వల్ల రాష్ట్రం నష్టపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల బాగు కోసం అగ్నిప‌‌‌‌‌‌‌‌థ్ వ్యతిరేక ఉద్యమం జరగాలి. అంతేగాని రాష్ట్రంలో  హింస, విధ్వంసం సృష్టించడానికి నిరసనలు జరగడం దారుణమన్నారు. అహింసాయుత ప్రదర్శనకు తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీల మధ్య వైరం వల్ల బీహార్ తగలబడిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ, జేడీ యూ పార్టీలు విషయాన్ని అర్ధం చేసుకుని.. సమస్యను పరిష్కరించడానికి బదులుగా ఒకరినొకరు నిందించుకుంటున్నారని ప్రశాంత్ కిషోర్ మండిపడ్డారు. హింసాత్మక నిరసనలను ఆపడానికి నితీష్ కుమార్ ప్రభుత్వం  ప్రయత్నాలు చేయడం లేదని ఆయన విమర్శించారు.