హీరోగా మై విలేజ్ షో అనిల్ జీలా.. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఓటీటీ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

హీరోగా మై విలేజ్ షో అనిల్ జీలా.. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఓటీటీ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో వస్తున్న వెబ్ సిరీస్‌ ‘మోతెవరి లవ్ స్టోరీ’. అనిల్ జీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రలు పోషించారు. శివ కృష్ణ బుర్రా దర్శకత్వంలో విలేజ్ షో మూవీస్ నిర్మించిన ఈ విలేజ్ కామెడీ, లవ్ సిరీస్ ఆగస్టు 8 నుంచి జీ 5 ఓటీటీలోకి వస్తోంది.

బుధవారం హీరో ఆనంద్ దేవరకొండ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశాడు. అనంతరం మాట్లాడుతూ ‘టైటిల్, పోస్టర్ కొత్తగా ఉంది. ‘దొరసాని’సినిమా కోసం మై విలేజ్ షో కంటెంట్ చూసే డైలాగ్స్, యాసను నేర్చుకున్నా. అదే టీమ్ నుంచి వస్తున్న ఈ సిరీస్‌ సక్సెస్ కావాలని కోరుకుంటున్నా’అని చెప్పాడు. తెలంగాణ మూలాల్లోంచి తీసిన మొదటి సిరీస్ ఇదేనని నిర్మాత మధుర శ్రీధర్ అన్నారు.  

అనిల్ గీలా మాట్లాడుతూ.. "మా ‘మై విలేజ్ షో’టీం నుంచి మొదటి సారిగా ఇలా సిరీస్ చేశాం. మధుర శ్రీధర్ గారు మొదటి సిట్టింగ్‌కే కథను ఓకే చేశారు. జీ5 టీం వల్లే ఈ సిరీస్ ఇంత బాగా వచ్చింది. అనురాధ మేడం ఎప్పుడూ మా వెన్నంటే ఉండి సపోర్ట్ చేశారు. ఆమె ఇచ్చిన ధైర్యం వల్లే ఈ సిరీస్‌ ఇక్కడి వరకు వచ్చింది. ఆద్యంతం అందరూ నవ్వుకునేలా మోతెవరి లవ్ స్టోరీ ఉంటుందని" అనిల్ జీలా అన్నాడు. 

శివ కృష్ణ,  శ్రీకాంత్, శ్రీరామ్, వర్షిణి రెడ్డి, గంగవ్వ, సంగీత దర్శకుడు చరణ్ అర్జున్‌తో పాటు జీ5 ప్రతినిధులు పాల్గొన్నారు. వరల్డ్ ఫేమస్ లవర్ మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనిల్ జీలా ఇప్పుడు ఓటీటీ సిరీస్‌తో ఎలాంటి విజయం సొంతం చేసుకోనున్నాడో చూడాలి.