పసుపు రంగులోకి మారిన గని నీరు.. 25 మంది గల్లంతు

పసుపు రంగులోకి మారిన గని నీరు.. 25 మంది గల్లంతు

భారీ వర్షాలు మియన్మార్ లో విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. దీంతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతోంది. ఆగస్టు 15న ఉత్తర మయన్మార్‌లోని జాడే గని వద్ద భారీ కొండచరియలు విరిగిపడటంతో 25 మంది మరణించిన్నట్లు అధికారులు చెబుతున్నారు. 

12 మందికి పైగా తప్పిపోయారు. వారు తెలిపిన వివరాల ప్రకారం..కుండపోత వర్షం కారణంగా కాచిన్‌లోని హ్పాకాంత్ టౌన్‌షిప్ సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. గనిలో పని చేస్తున్న 30 మందికి పైగా మైనర్లపై అవి పడ్డాయి. 

ఈ ప్రమాదంలో 25 మంది మృతి చెందగా, కొందరు తప్పిపోయారు.  బాధితుల్లో ఎక్కువ మంది పురుషులే ఉన్నారు.  2020లోనూ ఇలాంటి ఘటనే జరగ్గా 162 మంది చనిపోయారు. వారిలో ఎక్కువగా వలస వచ్చి గనుల్లో పని చేస్తున్నవారే ఉంటారు. 

2015 న జరిగిన ప్రమాదంలో 113 మంది మరణించారు. ఇక్కడి గనులు కచిన్ ఇండిపెండెన్స్ ఆర్మీకి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నాయి. ఈ గనులపై స్థానికులకు కేంద్ర ప్రభుత్వానికి వివాదాలు నడుస్తున్నాయి. గనుల్లో ఒకటైన కాచిన్స్ హ్పకాంత్‌లోని జాడే వరద నీరు వచ్చి చేరుతోంది. గనిలో ఉండే కొన్ని రసాయనాల వల్ల ఆ నీరు పసుపు రంగులోకి మారాయి.