ఖమ్మం జిల్లాలో తల్లి కుమారుడి దారుణ హత్య సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్తుపల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన తులశమ్మ(75) ఆమె కుమారుడు రాయల సత్యనారాయణ(50) లు స్థానికంగా నివసిస్తున్నారు.
కుమారుడు దివ్యాంగుడు. అయితే ఆగస్టు 1 ఉదయం ఇరువురు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ముందురోజు రాత్రే హత్య జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం నారాయణపురం గ్రామంలో దారుణం