ఎయిరిండియా కొత్త ఛైర్మన్ నియామకం

ఎయిరిండియా కొత్త ఛైర్మన్ నియామకం

న్యూఢిల్లీ : ఎయిరిండియా కొత్త ఛైర్మన్గా నటరాజన్ చంద్రశేఖరన్ ను నియమిస్తున్నట్లు టాటా గ్రూప్ ప్రకటించింది. ఆయన అపాయింట్మెంట్ను కన్ఫామ్ చేస్తూ బోర్డు ప్రకటన విడుదల చేసింది. టర్కీకి చెందిన ఇల్కర్ ఐసీని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమిస్తున్నట్లు టాటా గ్రూప్ గతంలో ప్రకటించింది. అయితే దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో వెనక్కి తగ్గింది. చంద్రశేఖరన్ ప్రస్తుతం టాటా సన్స్ ఛైర్మన్ తో పాటు 100 టాటా ఆపరేటింగ్ కంపెనీల ప్రమోటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2016లో టాటా సన్స్ బోర్డులో జాయిన్ అయిన ఆయనను 2017 జనవరిలో ఛైర్మన్ గా నియమించారు.  

2016 అక్టోబరులో టాటా సన్స్ బోర్డులో జాయినైన నటరాజన్ చంద్రశేఖరన్ జనవరి 2017లో ఛైర్మన్ గా అపాయింట్ అయ్యారు. టాటా మోటార్స్, టాటా స్టీల్, టాటా పవర్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీలకు 2009 నుంచి 2017 వరకు సీఈఓగా ఉన్నారు. టీసీఎస్ లో కెరీర్ ప్రారంభించిన చంద్రశేఖరన్ 30 ఏళ్లు సేవలందించి ఛైర్మన్ స్థాయికి ఎదిగారు. 

For more news..

కాంగ్రెస్ ఓటమికి వారే బాధ్యత వహించాలి

శ్రీలంకను వైట్ వాష్ చేసిన రోహిత్ సేన