శ్రీలంకను వైట్ వాష్ చేసిన రోహిత్ సేన

 శ్రీలంకను వైట్ వాష్ చేసిన రోహిత్ సేన

శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 238 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించి  2 టెస్టుల సిరీస్ ను సొంతం చేసుకుంది. 447 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్ లో 208 పరుగులకే ఆలౌట్ అయ్యింది. శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణ రత్నె 107 పరుగులతో ఒంటిరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది.  శ్రీలంక బ్యాట్స్ మెన్ కుసాల్ మెండీస్54 మినహా మిగతా వారెవరూ రాణించలేకపోయారు. భారత బౌలర్లలో  రవిచంద్ర అశ్విన్ 4, బుమ్రా 3, అక్షర్ పటేల్ 2, జడేజా ఒక వికెట్ తీశారు.

  •  భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్  252 ఆలౌట్
  • భారత్ సెకండ్ ఇన్నింగ్స్ 303/9 డిక్లేర్
  • శ్రీలంక ఫస్ట్ ఇన్నింగ్స్ 109 ఆలౌట్
  • శ్రీలంక సెకండ్ ఇన్నింగ్స్ 208 ఆలౌట్