ఆ సినిమా పాటనే టైటిల్ గా.. కొత్త మూవీ

ఆ సినిమా పాటనే టైటిల్ గా.. కొత్త మూవీ

ఆటగదరా శివ, మిస్ మ్యాచ్ తదితర చిత్రాలతో ఆకట్టుకున్న ఉదయ్ శంకర్, ప్రస్తుతం ‘నచ్చింది గాళ్ ఫ్రెండ్‌‌’ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. జెన్నిఫర్ హీరోయిన్. మధు నందన్, శ్రీకాంత్ అయ్యంగార్, గాయత్రి భార్గవి, సౌరవ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. పూరి జగన్నాథ్‌‌ శిష్యుడు గురు పవన్ దర్శకుడు. అట్లూరి నారాయణరావు నిర్మాత. ఓ పాట మినహా షూటింగ్ పూర్తయింది. ఈరోజు హీరో ఉదయ్ శంకర్ పుట్టినరోజు సందర్భంగా నిన్న ప్రెస్‌‌ మీట్ నిర్వహించారు. ఉదయ్ శంకర్ మాట్లాడుతూ ‘నటుడిగా కెరీర్‌‌‌‌ మొదలై నాలుగేళ్లయింది. ఇది నా నాలుగో సినిమా. కమర్షియల్‌‌ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌గా రూపొందుతున్న ఈ లవ్‌‌ స్టోరీతో నటుడిగా నాకు మంచి పేరు వస్తుందని నమ్ముతున్నా.. మూవీ స్టోరీ విశాఖపట్టణం నేపథ్యంలో సాగుతుంది కాబట్టి 70 శాతం అక్కడే షూట్ చేశాం.. చిరంజీవి సినిమాలోని పాట సూపర్ హిట్ అయింది కాబట్టి అదే పాటను టైటిల్ గా తీసుకున్నాం.. ’ అన్నాడు. 

దర్శకుడు మాట్లాడుతూ ‘టైటిల్‌‌కు మంచి రెస్పాన్స్‌‌ వస్తోంది. నచ్చిన విషయం కోసం ఎంతదూరమైనా వెళ్లే యువకుడు, తన మనసుకు నచ్చిన ప్రియురాలు కోసం ఏం చేశాడు అనేది కథ. త్వరలో గోవాలో తీయబోయే పాటతో షూట్ పూర్తవుతుంది’ అన్నాడు. ‘సెప్టెంబర్‌‌‌‌ లేదా అక్టోబర్ లో మూవీ రిలీజ్‌‌కి ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు నిర్మాత అట్లూరి నారాయణరావు. నటులు సౌరవ్, మధు నందన్, సంగీత దర్శకుడు గిఫ్టన్ ఎలియాస్, డీవోపీ సిద్ధం మనోహర్ తదితరులు పాల్గొన్నారు.