VRUSHAKARMA: నాగచైతన్య బర్త్ డే స్పెషల్.. కొత్త సినిమా టైటిల్ ఫిక్స్.. ‘వృషకర్మ’ అర్ధం ఇదే!

VRUSHAKARMA: నాగచైతన్య బర్త్ డే స్పెషల్.. కొత్త సినిమా టైటిల్ ఫిక్స్.. ‘వృషకర్మ’ అర్ధం ఇదే!

తండేల్ సక్సెస్తో మంచి జోష్ మీదున్నాడు నాగచైతన్య (Naga Chaitanya). ఇదే సక్సెస్ను కొనసాగించేలా ఇపుడు తన నెక్స్ట్ మూవీని (NC24) రంగంలోకి దించాడు. విరూపాక్ష మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన కార్తిక్​ దండు (Karthik Dandu) డైరెక్షన్లో చై ఓ సినిమా చేస్తున్నాడు.

మైథికల్ థ్రిల్లర్గా రానున్న ఈ ప్రాజెక్ట్ (NC24) అనౌన్స్ మెంట్ 2024 చివర్లో వచ్చింది. ఆ తర్వాత మూవీకి సంబంధించిన గ్లింప్స్, పోస్టర్స్, హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ క్రమంలోనే మరో క్రేజీ అప్డేట్తో అక్కినేని ఫ్యాన్స్కి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. 

ఇవాళ (2025 నవంబర్ 23న) నాగ చైతన్య 39వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చైతన్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ..‘చై ఫస్ట్ లుక్ పోస్టర్, మూవీ టైటిల్’ అనౌన్స్ చేసారు. సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ‘‘వృషకర్మ’’ (VRUSHAKARMA) అనే టైటిల్ ప్రకటించారు. వృష‌క‌ర్మ‌ అంటే కార్యసాధకుడు, చేసే పనిపై శ్రద్ధ ఉన్నవాడు అని అర్థం.

ఈ మూవీలో నిధి అన్వేషకుడిగా నాగ చైతన్య కనిపించనున్నాడు. పోస్టర్ చూస్తుంటే..'చై'.. తన పాత్ర కోసం ఫిజికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, మెంటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కంప్లీట్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్మేషన్ అయ్యాడని తెలుస్తోంది. ‘తండేల్’ సక్సెస్ తర్వాత నాగ చైతన్య నటిస్తున్న చిత్రం అవ్వడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే కథ, కథనాలను సెట్ చేశాడు డైరెక్టర్ కార్తీక్. ఇప్పటికే, డైరెక్టర్ కార్తీక్ దండు విజన్పై విరూపాక్ష మూవీతో ప్రతిఒక్కరికీ తెలిసింది. ఇక చైతో ఒక గట్టి హిట్ కొట్టేయండి బాస్.. అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇందులో నాగచైతన్యకి జోడిగా మీనాక్షి చౌదరి నటిస్తుంది. ‘దక్ష’ అనే ఆర్కియాలజిస్ట్‌‌‌‌ సైంటిస్ట్గా కనిపించనుంది. ఆమె పాత్ర సినిమాకు చాలా కీలకంగా ఉంటుందని సమాచారం. హిందీ మూవీ ‘లాపతా లేడీస్‌‌‌‌’ఫేమ్ స్పర్ష్‌‌‌‌ శ్రీవాత్సవ విలన్‌‌‌‌గా నటిస్తున్నాడు. ఈ మూవీకు సుకుమార్ స్టోరీ అందిస్తుండగా.. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.