క్రేజీ మ్యూజిక్ కంపోజర్ తో నాగ చైతన్య- చందు మొండేటి ఫిల్మ్

క్రేజీ మ్యూజిక్ కంపోజర్ తో నాగ చైతన్య- చందు మొండేటి ఫిల్మ్

నాగ చైతన్య(Naga Chaitanya)..చందూ మొండేటి(Chandoo Mondeti),  క్రేజీ కాంబోలో మరో మూవీ రాబోతుంది.  ప్రేమమ్ మూవీ తో మంచి హిట్ అందుకున్న వీరు..  త్వరలో ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తాజా సమాచారం మేరకు ఈ మూవీకు కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్(Anirudh)  స్వరాలు అందించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అనిరుధ్ కనుక ఈ ప్రాజెక్ట్ లో చేరితే ఈ సారి చైతూకు హిట్ పడడం పక్కా అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్. ఈ మూవీ.. శ్రీకాకుళం నుండి గుజరాత్ కు వలస వెళ్లే మత్స్యకారుల కుటుంబాల నేపథ్యంలో కథను చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. 

ఒక అందమైన ప్రేమ కథతో పాటు, చైతు బోటు డ్రైవర్ పాత్రలో నటిస్తారని తెలుస్తోంది. ఈ మూవీ లో నాగచైతన్య కు జోడీగా మహానటి కీర్తి సురేష్(Keerthy Suresh) నటిస్తున్నట్లు తెలుస్తోంది. చైతన్య తో కీర్తి సురేష్ తొలిసారిగా నటిస్తున్న ఈ కాంబో పై అభిమానుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. గీత ఆర్ట్స్(Geeta Arts) బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో, బన్నీ వాసు (Allu Aravind) ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిర్మించనున్నారు.

రీసెంట్ గా కార్తీకేయ 2 మూవీతో వంద కోట్ల క్లబ్ లో చేరిన చందు మొండేటి.. చైతన్యకు ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి. ఈ మూవీను ఇదే ఏడాది స్టార్ట్ చేసి వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం. ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో మేకర్స్  ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.