ఒక చేతిలో గొడ్డలి, మరో చేతిలో జూట్ రోప్.. మాస్ లుక్‎లో అదరగొట్టిన నాగ చైతన్య

ఒక చేతిలో గొడ్డలి, మరో చేతిలో జూట్ రోప్.. మాస్ లుక్‎లో అదరగొట్టిన నాగ చైతన్య

నాగ చైతన్య హీరోగా ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ మిస్టీరియస్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. ఎస్వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది.  శుక్రవారం నుంచి హైదరాబాద్‌‌‌‌లో సెకండ్ షెడ్యూల్‌‌‌‌ను స్టార్ట్ చేశారు. ఈ షెడ్యూల్‌‌‌‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. నాగ చైతన్యతో పాటు ఇందులో నటిస్తున్న ప్రధాన పాత్రధారులంతా పాల్గొంటున్నారు.  

హైదరాబాద్‌‌‌‌లోని మూడు డిఫరెంట్ లొకేషన్స్‌‌‌‌లో ఈ షెడ్యూల్ జరగనుందని మేకర్స్ తెలియజేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌‌‌‌‌‌‌‌లో నాగ చైతన్య ఒక చేతిలో గొడ్డలి, మరో చేతిలో జూట్ రోప్ పట్టుకుని కనిపిస్తున్న స్టిల్ ఇంటరెస్టింగ్‌‌‌‌గా ఉంది.  ‘ఒక అడుగు లోతుగా, ఒక అడుగు దగ్గరగా’ అని ఈ పోస్టర్‌‌‌‌‌‌‌‌కు క్యాప్షన్‌‌‌‌ ఇవ్వడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.  నాగ చైతన్య హీరోగా నటిస్తున్న 24వ సినిమా ఇది.