క్రేజీ కాంబో: బాలయ్య మూవీలో నాగశౌర్య

క్రేజీ కాంబో: బాలయ్య మూవీలో నాగశౌర్య

హైదరాబాద్: యంగ్ హీరో నాగశౌర్య పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అయితే త్వరలో ఓ క్రేజీ మూవీలో ఆయన నటించనున్నట్లు పుకార్లు వస్తున్నాయి. బాడీ బిల్డింగ్ మీద దృష్టి పెట్టిన నాగశౌర్య.. పాత్రల పరంగా కూడా డిఫరెంట్ రోల్స్‌‌లో అలరించాలని అనుకుంటున్నట్లు రీసెంట్‌‌గా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అందుకు తగ్గట్లే శ్రీమాన్ వేముల అనే కొత్త డైరెక్టర్‌తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఈ ఫిల్మ్‌‌లో మూగ, చెవిటి పాత్రలో నాగశౌర్య యాక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ లీడ్ రోల్‌‌లో నటించనున్న ఈ మూవీలో నాగశౌర్య పాత్ర ఫన్నీగా ఉంటుందని సమాచారం. ‘అవును, నాగశౌర్య మూగ, చెవిటి పాత్రలో నటించనున్నాడు. నటించడానికి మంచి స్కోప్ ఉన్న రోల్ ఇది. కథ కూడా బాగుంటుంది. బాలకృష్ణ, నాగశౌర్య లీడ్ రోల్స్‌‌లో కనిపిస్తారు’ అని ఈ మూవీ యూనిట్‌‌కు సన్నిహితంగా ఉండే వర్గాలు తెలిపాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.