
నాగశౌర్య, కేతికాశర్మ జంటగా సంతోష్ జాగర్లమూడి తెరకెక్కించిన స్పోర్ట్స్ బేస్డ్ మూవీ ‘లక్ష్య’. సునీల్ నారంగ్, పుస్కూరు రామ్మోహన్ రావు, శరత్ మరార్ కలిసి నిర్మించిన ఈ మూవీ డిసెంబర్ 10న విడుదల కానుంది. ట్రైలర్‌ను నిన్న వెంకటేష్ సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నాగశౌర్య మాట్లాడుతూ ‘సంతోష్ ఈ కథను చాలా డిటెయిల్డ్‌గా చెప్పడంతో చాలా ఎక్సయిటయ్యాను. చేస్తే ఇలాంటి సినిమానే చేయాలనిపించింది. ‘రొమాంటిక్’ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న కేతికకు ఈ సినిమా మరింత ప్లస్ అవుతుంది. సచిన్ ఖేడ్కర్, జగపతిబాబులవి మేజర్ రోల్స్. మణి బెస్ట్ డైలాగ్స్ రాశారు. ఏషియన్ సినిమాస్ సంస్థతో వర్క్ చేయడం హ్యాపీ’ అన్నాడు. సంతోష్ మాట్లాడుతూ ‘ఆర్చరీ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఫస్ట్ మూవీ ఇది. నేను నలభై శాతం రాసుకున్న కథకి నూరు శాతం న్యాయం చేశాడు శౌర్య. అన్ని పాత్రలకీ ఇంపార్టెన్స్ ఉంటుంది’ అని చెప్పాడు. చాన్స్ ఇచ్చిన దర్శక నిర్మాతలకి థ్యాంక్స్ చెప్పింది కేతిక. ‘స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాలకి ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. డిఫరెంట్ లెవెల్‌లో ఉన్న ఈ సినిమా హిట్టవుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు రామ్మోహన్‌రావు.