
కూల్‌గా ఉండే పాత్రలతో టాలీవుడ్‌లో ఫాలోయింగ్ సంపాదించుకున్న నాగచైతన్య.. ఒక సీరియస్ పాత్రతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఆమిర్‌ఖాన్ హీరోగా నటిస్తున్న ‘లాల్‌సింగ్ చద్ధా’లో ఆమిర్‌కి ఫ్రెండ్‌గా కనిపించనున్నాడు చైతు. ఆర్మీ ఆఫీసర్ పాత్ర కావడంతో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాడు. మేకోవర్ కూడా అయ్యాడు. లడఖ్‌లో జరుగుతున్న ఫైనల్ షెడ్యూల్లో నిన్న జాయినయ్యాడు చైతు. ఇరవై రోజుల పాటు షూట్‌లో పాల్గొంటాడట. ప్రస్తుతం కార్గిల్ వార్‌కి సంబంధించిన యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. హాలీవుడ్ క్లాసిక్ ‘ఫారెస్ట్ గంప్’కి ఇది రీమేక్. అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నాడు. కరీనా కపూర్ హీరోయిన్. ఈ యేడు క్రిస్మస్‌కి సినిమాని రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే విక్రమ్ కుమార్ డైరెక్షన్లో ‘థాంక్యూ’ మూవీ చేస్తున్నాడు చైతు. ఇంకా కొంత వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. వీలైనంత త్వరగా దాన్ని పూర్తి చేయబోతున్నాడు. తర్వాత తన తండ్రి నాగార్జునతో కలిసి ‘బంగార్రాజు’ మూవీ చేయాల్సి ఉంది. కిశోర్ తిరుమలతో కూడా ఓ మూవీకి కమిటైనట్టు తెలుస్తోంది. ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయిపల్లవితో కలిసి నటించిన ‘లవ్ స్టోరి’ రిలీజ్‌కి రెడీగా ఉంది. థియేటర్స్ ఓపెన్ కాగానే ప్రేక్ష కుల ముందుకు రానుంది.