
సంక్రాంతికి చిన ‘బంగార్రాజు’గా వచ్చిన నాగచైతన్య త్వరలో ‘థాంక్యూ’ మూవీతో రానున్నాడు. విక్రమ్ కుమార్ డైరెక్షన్‌లో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ నిన్న పూర్తయింది. ఈ చిత్రంలో చైతు మూడు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించనున్నాడు. రాశీఖన్నా, అవికా గోర్, మాళవిక నాయర్ హీరోయిన్స్. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. ఇదే దర్శకుడితో ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాడు చైతు. దీనికి ‘దూత’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. ఇక ఆమిర్ ఖాన్‌తో కలిసి నటించిన ‘లాల్ సింగ్ చద్ధా’ ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. దర్శకులు పరశురామ్, విజయ్ కనక మేడల, వెంకట్ ప్రభుల ప్రాజెక్ట్స్ లైన్‌లో ఉన్నాయి. ఏది ముందు సెట్స్‌కి వెళ్తుందో.