Nagachaithanya: వంద కోట్ల హిట్ డైరెక్టర్తో నాగ చైతన్య!..మైథికల్ థ్రిల్లర్తో వస్తున్నారా..?

Nagachaithanya: వంద కోట్ల హిట్ డైరెక్టర్తో నాగ చైతన్య!..మైథికల్ థ్రిల్లర్తో వస్తున్నారా..?

కార్తిక్​ దండు (Karthik Dandu) డైరెక్షన్లో వచ్చిన విరూపాక్ష బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్(Sai Dharam Tej)​ కెరీర్ లోనే బెస్ట్​ ఓపెనింగ్స్​ అందుకున్నారు. ఈ మూవీకి స్టోరీ , స్క్రీన్​ప్లే ను డైరెక్టర్ సుకుమార్​ అందించగా బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. 

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం విరూపాక్ష తెరకెక్కించిన మూవీ డైరెక్టర్ కార్తీక్ దండు అక్కినేని నాగచైతన్య(Nagachaithanya)తో సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే అదిరిపోయే థ్రిల్లర్ స్టోరీని చైకి వినిపించాడట కార్తీక్.

డైరెక్టర్ కార్తీక్ చెప్పిన కథ నచ్చడంతో చై గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ ఇంట్రెస్టింగ్ కాంబో నుంచి ఆఫీసియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే, నాగ చైతన్య కి వంద కోట్ల హిట్ పడితే చూడాలన్నది అక్కినేని ఫ్యాన్స్ కల. ఎందుకంటే, బంగార్రాజు,లవ్ స్టోరీ చిత్రాలు వచ్చి పర్లేదు అనిపించినా బాక్సాఫీస్ బాద్ షా అనిపించుకోలే. ఒక మోస్తరు హిట్ కంటే.. హై రేంజ్ హిట్ కావాలంటూ ఫ్యాన్స్ గిరి గీసీ పెట్టుకున్నారు.

డైరెక్టర్ కార్తీక్ దండు విజన్ పై విరూపాక్ష మూవీతో ప్రతిఒక్కరికీ తెలిసింది. ఇక చైతో ఒక గట్టి హిట్ కొట్టేయండి బాస్..అంటూ ఫ్యాన్స్ హోప్స్ పెట్టుకున్నారు. మరి త్వరలో అధికారిక ప్రకటనతో పాటు స్టోరీ ఎలాంటిదో కూడా తెలిసిపోతుంది.ప్రస్తుతం చై తండేల్ మూవీతో బిజీగా ఉన్నారు  

గతంలో ఓ మైథికల్ థ్రిల్లర్ గా రాబోతున్నట్లు కార్తీక్ దండు పోస్టర్ ను రిలీజ్ చేశారు. ప్రపంచంలో నమ్మ శక్యం కానీ విషయాలను..నమ్మడానికి సిద్ధంగా ఉండండి ఉంటూ సుకుమార్( Sukumar) సైతం ట్వీట్ చేశారు. ఈ మూవీకు కూడా సుకుమార్ స్టోరీ అందిస్తుండగా..కార్తిక్​ దండు డైరెక్షన్ చేస్తున్నట్టు ప్రకటించారు.

కానీ, అందులో నటీనటులు ఎవరనేది అనౌన్స్ చేయలేదు. అయితే, అదే ప్రాజెక్ట్  హ? లేక వేరే స్టోరీతో వస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.