ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించండి : ఉదయ్ కుమార్

ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించండి : ఉదయ్ కుమార్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని నాగర్ కర్నూల్ కలెక్టర్‌‌‌‌ ఉదయ్ కుమార్ అన్నారు. సోమవారం కలెక్టర్‌‌‌‌ ఛాంబర్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్ కుమార్ దీపక్, అడిషనల్​  కలెక్టర్ సీతారామారావు, కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్ పాల్గొన్నారు. 
 

గద్వాల: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే సమస్యలకు ప్రాధాన్యం  ఇచ్చి వాటిని పరిష్కరించాలని  కలెక్టర్ సంతోష్ ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్​లో  ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై వచ్చిన ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో వివిధ ప్రాంతల నుంచి భూ సమస్యలపై 93, ఇతర సమస్యలకు సంబంధించి 57, మొత్తం 150 దరఖాస్తులు వచ్చాయన్నారు.

ఈ కార్యక్రమం లో అడిషనల్​ కలెక్టర్ అపూర్వ్ చౌహన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ కలెక్టరేట్: ప్రజావాణి  వినతులు సత్వరం పరిష్కరించాలనికలెక్టర్ జి. రవి నాయక్ అధికారులను అధేశించారు. సోమవారం కలెక్టరేట్ లో ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజల ఫిర్యాదులో ఎలాంటి నిర్లక్ష్యం చేయొద్దన్నారు. అడిషనల్ కలెక్టర్‌‌‌‌ ఎం. మోహన్‌‌‌‌రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.