కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: చిక్కుడు వంశీకృష్ణ

కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: చిక్కుడు వంశీకృష్ణ

వంగూరు, వెలుగు: వచ్చే ఎన్నికల్లో అచ్చంపేటలో కాంగ్రెస్  పార్టీ జెండా ఎగరేస్తామని నాగర్ కర్నూల్  డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే  డాక్టర్  చిక్కుడు వంశీకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అభివృద్ధి చేయకుండా నియోజకవర్గంలో గుళ్లు, గుప్త నిధులు, భూములు సెటిల్​మెంట్లపై దృష్టి పెట్టారని విమర్శించారు.

నియోజకవర్గ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ, గిట్టని వారిని అక్రమ కేసుల్లో ఇరికించి ఇబ్బందులకు గురి చేయడం తప్ప గువ్వల చేసిందేమిలేదన్నారు. ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. గువ్వల ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఓడిపోవడం ఖాయమన్నారు.