
బుల్లితెర రియాల్టీ షో 'బిగ్ బాస్' కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికే హిందీలో 'బిగ్ బాస్ సిజన్ 19' ప్రారంభమై అలరిస్తోంది. దీనికి బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఇప్పుడు 'బిగ్ బాస్' తెలుగు కొత్త సీజన్‌తో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా.. 'బిగ్ బాస్ తెలుగు 9' (Bigg Boss Telugu 9) కొత్త డ్రామా, అద్భుతమైన ఎంటర్‌టైన్‌మెంట్ ,ఉత్సాహభరితమైన కొత్త పోటీదారులతో తిరిగి వస్తోంది. సెలబ్రిటీలు, కామనర్ల కలయికతో రూపొందించబడిన ఈ సీజన్.. ప్రేక్షకులలో ఆసక్తిని అంతకంతకు పెంచుతోంది. బిగ్ బాస్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ రియాల్టీ షో ఎప్పుడు ప్రారంభమవుతుందో, నాగార్జున ఎంట్రీ ఎలా ఉండబోతుందో.. ఏ సమయంలో టీవీ, ఓటీటీలో ప్రసారం అవుతుందో చూద్దాం.
'బిగ్ బాస్ తెలుగు9' గ్రాండ్ లాంచ్..
అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మెయిన్ 'బిగ్ బాస్ తెలుగు 9' గ్రాండ్ లాంచ్ సెప్టెంబర్ 7న సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ షో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతుంది. అలాగే జియోహాట్ స్టార్ లో ( Jio Hot Star ) లైవ్ స్ట్రీమింగ్ కూడా అందుబాటులో ఉంటుంది. హోస్ట్ గా నాగార్జున.. గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్‌లో పోటీదారులను పరిచయం చేసి, ప్రేక్షకులను డబుల్ హౌస్‌లోకి తీసుకెళ్లి దాని విశేషాలను తెలియజేస్తారు. సామాన్యులకు 'అగ్నిపరీక్ష' ప్రీ-షోతో ఇప్పటికే ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేసింది.
ఈసారి డబుల్ ధమాకా!
ఈసారి బిగ్ బాస్ కొత్త ఫార్మాట్‌లో డబుల్ హౌస్ కాన్సెప్ట్‌తో రాబోతోంది. ఇది ప్రేక్షకులకు మరింత రెట్టింపు వినోదాన్ని అందిస్తుందని మేకర్స్ హామీ ఇస్తున్నారు. తొలిసారిగా, సామాన్యులు కూడా సెలబ్రిటీలతో పోటీ పడి బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టే అవకాశం కల్పించారు. ఈ మెయిన్ సీజన్‌కు ముందు, బిగ్ బాస్ మేకర్స్ సామాన్యులకు 'అగ్నిపరీక్ష' పేరుతో ఒక ప్రీ-షోను నిర్వహించారు. దీనికి ప్రముఖ యాంకర్ శ్రీముఖి హోస్ట్ చేయగా, మాజీ బిగ్ బాస్ విజేతలు బిందు మాధవి, నవదీప్, అభిజిత్ జడ్జీలుగా వ్యవహరించారు.
ALSO READ : ఉప్పొంగుతున్న పవనిజం.. USలో 'OG' అడ్వాన్స్ సేల్స్ రికార్డ్స్!
ఈ ప్రీ-షోలో 45 మంది షార్ట్‌లిస్ట్ అయిన పోటీదారులు వివిధ టాస్కులలో పాల్గొన్నారు. వారిలో నుంచి 15 మంది కామనర్లను ఎంపిక చేశారు. ఈ షార్ట్‌లిస్ట్ అయిన వారిలో అనుష రత్నం, ప్రియా శెట్టి, దమ్ము శ్రీజ, దివ్య నిఖిత, శ్రియ, శ్వేత శెట్టి, డెమోన్ పవన్, ప్రసన్న కుమార్, మిస్ తెలంగాణ కల్కి, డాలియా, మర్యాద మనీష్, పవన్ కళ్యాణ్, షాకిబ్ వంటి వారు ఉన్నారు. వీరు సెలబ్రిటీలతో పోటీ పడి బిగ్ బాస్ హౌస్‌లో చోటు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ 15 మందిలో వివిధ టాస్క్ లలో విజేతలుగా నిలిచిన కొందరిని మొయిన్ 'బిగ్ బాస్ 9' హౌస్ లోకి పంపించనున్నారు.
సెలబ్రిటీల లిస్ట్ ఇదేనా?
ఇక మొయిన్ బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లోకి అడుగుపెట్టబోయే సెలబ్రిటీల జాబితా కూడా బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వారిలో దీపిక, దేబ్‌జాని, కావ్య, తేజస్విని, శివ కుమార్, రీతూ చౌదరి, కల్పిక గణేష్, సుమంత్ అశ్విన్, సాయి కిరణ్, ఎమ్యానుయెల్, సాకేత్ లాంటి పేర్లు వినిపిస్తున్నాయి. వీరితో పాటు మరికొందరు ఊహించని సెలబ్రిటీలు కూడా హౌస్‌లోకి రానున్నట్లు సమాచారం.
మొత్తానికి, 'అగ్నిపరీక్ష' థీమ్‌తో, డబుల్ హౌస్ ఫార్మాట్‌తో, సెలబ్రిటీలు, కామనర్ల కలయికతో బిగ్ బాస్ తెలుగు 9 సరికొత్త ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించడానికి సిద్ధమైంది. మరి ఈ సీజన్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో.. కంటెస్టెంట్ లలో ఎవరు విజేతగా నిలవనున్నరో చూడాలి మరి..