నాగ్ 'గన్స్ అండ్ స్వార్డ్స్ యాక్షన్ వీడియో'

నాగ్ 'గన్స్ అండ్ స్వార్డ్స్ యాక్షన్ వీడియో'

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘ది ఘోస్ట్’. ఇందులో నాగార్జునకు జోడీగా సోనాల్ చౌహాన్ నటిస్తోంది. ప్రవీణ్ స‌త్తారు ద‌ర్శక‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 5న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ 'గన్స్ అండ్ స్వార్డ్స్ యాక్షన్ వీడియో' అంటూ ఓ మేకింగ్ వీడియోని విడుదల చేశారు మేకర్స్. 

గన్స్ షూటింగ్ తో పాటు కత్తి ఫైట్ కి సంబంధించి.. నాగ్ శిక్షణ తీసుకున్న విజువల్స్ ను చూపించారు. హీరోయిన్ సోనాల్ చౌహాన్ కూడా ఫైట్స్ లో ప్రత్యేక శిక్షణతో పాటు ప్రాక్టీస్ చేసినట్టగా ఈ మేకింగ్ వీడియో చూస్తే తెలుస్తోంది. ఈ సినిమాలో ఈ ఇద్దరు ఇంటర్ పోల్ అధికారులుగా నటించారు. బాలీవుడ్ నటి గుల్ పనాగ్, తమిళ నటి అనికా సురేంద్రన్ ఈ మూవీలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్, సునీల్ నారంగ్ లు ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజైన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌లతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.