ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తోందే..నా సామి రంగా! కింగ్ రొమాన్స్ అదుర్స్..

ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తోందే..నా సామి రంగా! కింగ్ రొమాన్స్ అదుర్స్..

టాలీవుడ్ కింగ్ నాగార్జున (Nagarjuna) కెరీర్లో 99వ సినిమాగా రానున్న నా సామి రంగా మూవీ జెడ్ స్పీడ్తో దూసుకెళ్తోంది. ప్రముఖ డాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీ(Vijay binny) తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కన్నడ బ్యూటీ ఆషిక రంగ‌నాథ్ థ్ హీరోయిన్గా నటిస్తోంది. 

లేటెస్ట్గా నా సామి రంగా నుంచి ఫస్ట్ సింగిల్ ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తోందే సాంగ్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి స్వరపరిచిన ఈ పాటకు..చంద్రబోస్ తనదైన మ్యాజిక్ తో లిరిక్స్ రాయగా..సింగర్ రామ్ మిరియాల పాడారు. నాగ్- ఆషిక కెమిస్ట్రీ మన్మధుడి ఫ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంటోంది.

బెల్లం చెరుకు చూపులదానా..అల్లం మిరప మాటలదానా..బొండుమల్లి మాటలదానా.. బండడుసోకు ఓ నెరజాణ..నువ్వట్టా పోతుంటే..నిన్నిట్ఠా చూస్తుంటే..ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తోందే..సాంగ్ మెస్మరైజ్ చేస్తోంది. ఈ పాటకు విజయ్ బిన్నీ కోరీయోగ్రఫీ అందించాడు. 

శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తోండగా..పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది 2024 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇక సంక్రాంతి పండగకు నాగార్జున ఎప్పటిలాగే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి మీద ఉన్నారు.