నాగార్జునసాగర్కు కొనసాగుతున్న వరద..26 గేట్ల నుంచి దిగువకు నీటి విడుదల

నాగార్జునసాగర్కు కొనసాగుతున్న వరద..26 గేట్ల నుంచి దిగువకు నీటి విడుదల

హాలియా, వెలుగు : నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కు​వరద ఉధృతి కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి 2,50,732 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వచ్చి చేరుతుండగా, అంతే నీటిని దిగువకు వదులుతున్నారు. సాగర్​26 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 2,01,318 క్యూసెక్కులను స్పిల్​వే మీదుగా వదులుతున్నారు. 

నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు(312.0450 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 586.60 అడుగుల(303.4310 టీఎంసీ)కు చేరుకుంది. ఎడమ కాల్వకు 5,156, కుడి కాల్వకు 9,019,హైదరాబాద్ జంట నగరాల తాగునీటి అవసరాలకు 2,400, వరద కాల్వకు 300, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 33,739 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.