
హాలియా, వెలుగు : శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ ఇన్‌ఫ్లో పెరగడంతో నాగార్జునసాగర్ గేట్లు మరోసారి తెరుచుకున్నాయి. సాగర్‌కు ఎగువ నుంచి 1,81,820 క్యూసెక్కుల వరద రావడంతో 16 గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 1,29,104 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ నుంచి ఎడమ కాల్వకు 8,022 క్యూసెక్కులు, కుడి కాల్వకు 10,040, ఏఎమ్మార్పీకి 1,200, వరద కాల్వకు 300, విద్యుత్ ఉత్పత్తికి 32,277 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.