
నాగార్జునసాగర్ ఉపఎన్నికలో బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ కడారి అంజయ్య టీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తున్నారు. సాగర్ అభ్యర్థిగా రవికుమార్ నాయక్‌ను బీజేపీ ప్రకటించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే బీజేపీకి భారీగానే నష్టం కలగనుంది. ఇప్పటికే టీఆర్ఎస్‌కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కడారి అంజయ్యతో చర్చలు జరుపుతున్నారు. దాంతో కడారి అంజయ్య మంగళవారం సీఎం కేసీఆర్‌ను కలుస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి. సాగర్ ఉపఎన్నిక బరిలో టీఆర్ఎస్ నుంచి నోముల నర్సింహ్మయ్య కొడుకు నోముల భగత్ అభ్యర్థిత్వం ఖరారు అయింది. కాంగ్రెస్ నుంచి సీనియర్ లీడర్ జానారెడ్డి పోటీకి దిగుతున్నారు.