నాగార్జున డబుల్‌‌ స్పీడ్

నాగార్జున డబుల్‌‌ స్పీడ్

సినిమా, టీవీ అనే తేడా లేకుండా రెండు చోట్లా మెప్పిస్తున్న నాగార్జున ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. కొత్త బిగ్‌‌ బాస్‌‌ షోకి హోస్ట్‌‌గా ఓటీటీ ఎంట్రీ ఇవ్వడంతో పాటు ఓ వెబ్‌‌ సిరీస్‌‌ కూడా చేయబోతున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్‌‌ స్టార్‌‌‌‌ డిస్నీ నిర్మించబోయే వెబ్‌‌ సిరీస్‌‌లో ఆయన నటించనున్నట్టు తెలుస్తోంది. ఓ కొత్త దర్శకుడు దీన్ని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌‌మెంట్‌‌ రానుందని టాక్. ఇక సినిమాల విషయానికొస్తే.. సంక్రాంతికి ‘బంగార్రాజు’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన నాగార్జున, ప్రస్తుతం ‘ద ఘోస్ట్’ సినిమాలో నటిస్తున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకుడు. ఇప్పటికే కొంత షూటింగ్ జరిగింది. ఈ నెల మూడు నుంచి దుబాయ్‌‌ షెడ్యూల్‌‌ ప్లాన్ చేశారు కానీ టీమ్‌‌లో కొందరికి కొవిడ్ రావడంతో వాయిదా పడింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫారిన్‌‌లో షూట్ కష్టం కనుక హైదరాబాద్‌‌లో ఓ షెడ్యూల్‌‌ని పూర్తి చేసేందుకు నిర్ణయించుకున్నారట. ఈ నెల పన్నెండు నుంచి షూట్ రీస్టార్ట్ కానున్నట్టు తెలుస్తోంది. నాగార్జునతో పాటు హీరోయిన్‌‌ సోనాల్‌‌ చౌహాన్‌‌ కూడా పాల్గొనబోతోందట. గుల్ పనాగ్, అనికా సురేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్‌‌‌‌ రామ్‌‌మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్నారు.