ఓటరు జాబితా పకడ్బందీగా రూపొందించాలి : కలెక్టర్ సంతోష్

ఓటరు జాబితా పకడ్బందీగా రూపొందించాలి : కలెక్టర్ సంతోష్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: నాగర్ కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్ మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ఓటరు జాబితా పకడ్బందీగా రూపొందించాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లో మున్సిపల్ ​కమిషనర్లతో సమావేశమయ్యారు. వార్డుల విభజన, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఓటర్ల జాబితా తయారీ, సిబ్బంది శిక్షణపై దిశానిర్దేశం చేశారు.  

ఈవీఎంల గోదాంపై నిఘా ఉంచండి

ఈవీఎంల భద్రత కీలకమని కలెక్టర్ సంతోష్ అన్నారు. నాగర్ కర్నూల్ మార్కెట్ యార్డు లోని ఈవీఎంల గోదాంను బుధవారం పరిశీలించారు. గోదాంపై నిఘా ఉంచాలని ఆదే శించారు. సీసీ కెమెరాలకు సంబంధించి సాంకేతిక లోపాలు తలెత్తితే పరిష్కరించాలన్నారు. ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రవికుమార్, పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.