ఉప్పునుంతల, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం అందజేసిన ఇందిరమ్మ చీరలు పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యేకంగా ఆకర్షించాయి. నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం మామిళ్ల పల్లిలో అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థి మొకురాల మోహన్ గౌడ్ కు మద్దతుగా శనివారం అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మహిళలు ఇందిరమ్మ చీరలు కట్టుకొని ప్రచారం చేశారు. ఇందిరమ్మ చీరలతో మహిళలు ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో ఎమ్మెల్యే అభినందించారు.
