నాగర్​కర్నూల్ ​మెడికల్ కాలేజీ స్వీపర్​పై సూపర్​వైజర్ ​అత్యాచారయత్నం

నాగర్​కర్నూల్ ​మెడికల్ కాలేజీ స్వీపర్​పై సూపర్​వైజర్ ​అత్యాచారయత్నం

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీలో పని చేస్తున్న మహిళా స్వీపర్​(34)పై అదే కాలేజీలో పని చేస్తున్న సూపర్​వైజర్ మహేశ్ అత్యాచారయత్నం చేశాడు. బాధితురాలి కథనం ప్రకారం..గురువారం సాయంత్రం నాగర్ కర్నూల్ పట్టణంలోని హౌసింగ్ బోర్డులో ఉన్న సాయి ఏజెన్సీ ఆఫీస్ క్లీన్ చేయాలని స్వీపర్ ను సూపర్​వైజర్ మహేశ్ పిలిపించాడు.

ఆఫీస్ రూమ్​లోకి వెళ్లగానే ఆమె ఫోన్ లాక్కుని అత్యాచారయత్నం చేయబోయాడు. వెంటనే ఆమె అతడిని ప్రతిఘటించి బయటికి వచ్చేసింది. తన భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో అతడు మెడికల్ కాలేజీ స్టాఫ్​కు సమాచారం ఇచ్చాడు. తర్వాత వారు సూపర్​వైజర్ ను తొలగించాలని ఆందోళన చేయడమే కాకుండా డ్యూటీలో ఉన్న మహేశ్​ను చితకబాది, పోలీసులకు సమాచారమిచ్చారు. వారు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. ఈ వ్యవహారంలో రాజీ కుదిర్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది.