
ముంబై: నాగిని 3 సీరియల్ ఫేమ్ పరల్ వీ పూరీని పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచారం, వేధింపుల కేసులో ఈ హిందీ బుల్లితెర నటుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫ్రెండ్స్‌తో కలసి తనను కిడ్నాప్ చేసి కారులో అత్యాచారానికి ఒడిగట్టాడని, అంతేగాక పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని పరల్ పూరీపై ఓ 16 ఏళ్ల బాలిక ఫిర్యాదు చేసింది. ఆమె కంప్లయింట్‌తో పోలీసులు పరల్ వీతోపాటు ఈ కేసుతో సంబంధం ఉన్న అతడి ఆరుగురు స్నేహితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితులు కస్టడీలో ఉన్నారని, విచారణను జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.