దీపావళి బోనస్ ఇవ్వలేదని చంపేశారు

దీపావళి బోనస్ ఇవ్వలేదని చంపేశారు

దీపావళి.. దీపాల పండగ వచ్చింది.. చాలా మంది ప్రజలు తమ కుటుంబాలతో కలిసి సంతోషంగా జరుపుకునే  పండగ.. ఉద్యోగస్తులకు ఇది సెలవు దినం.. ఈ పండగ సందర్భంగా యజమానులు తమ వర్కర్లకు బోనస్ లు, కొన్ని రకాల బహుమతులు ఇవ్వడం సాధారణం.. అయితే దీపావళికి ఇంటికి వెళ్లేందుకు తన సిబ్బందికి సెలవు నిరాకరించడం హత్యకు దారి తీసింది. 

దీపావళి పండగ సందర్భంగా మహారాష్ట్ర లోని నాగ్ పూర్ లో ఘోరం జరిగింది.నాగ్ పూర్ లోని ఓ డాబా యజమాని రాజు భౌరవ్ ని శనివారం రాత్రి  ఇద్దరు వర్కర్లు గొంతు కోసి హత్య చేశారు. 

నాగ్ పూర్ ఉమ్రేడ్ రహదారిపై పచ్ గావ్ లో దాబా నడుపుతున్న 48 యేళ్ల  రాజు భౌరవ్ .. దీపావళికి వెళ్లేందుకు తన వర్కర్లు అయిన ఛోటు , ఆదికి సెలవులు, బోనస్ సహా వారి ఇతర డిమాండ్లను తిరస్కరించారు. దీంతో ఆది, ఛోటు కలిసి భౌరవ్ ను చంపేశారు. 

మధ్యప్రదేశ్ మాండ్లాకు చెందిన చోటు, ఆది దీపావళికి ఇంటికి వెళ్లాలనుకున్నారు. వారు తమ యజమాని నుంచి దీపావళి బోనస్, సెలవు కోరారు. యజమాని ఒప్పకోలేదు.. దీంతో శనివారం రాత్రి డాబాలో డిన్నర్ చేస్తుండగా డబ్బు విసయంలో భౌరవ్, ఇద్దరు వర్కర్ల మధ్య వాగ్వాదం జరిగింది. తర్వాత అతను నిద్రపోయాడు. ఇద్దరు వర్కర్లు అతని గొంతు కోసి చెక్క దుంగతో తలపై మోదారు. దీంతో అక్కడిక్కడే మృతిచెండా భౌరవ్. 
తర్వాత దుండగులు ఇద్దరు భౌరవ్ కారులో అక్కడి నుంచి పారిపోయారు. విర్ గావ్ లోని నాగ్ నదిపై ఉన్న వంతెన సమీపంలో మరో వాహనాన్ని కారు ఢీకొట్టడంతో అక్కడ వదిలి వెళ్లారు. పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.