టెర్రరిస్టులను ఏరిపారేసిన జవాన్లపై ప్రధాని మోడీ ప్రశంసలు

టెర్రరిస్టులను ఏరిపారేసిన జవాన్లపై ప్రధాని మోడీ ప్రశంసలు

న్యూఢిల్లీ: దేశంలో భారీ టెర్రర్ అటాక్‌‌కు ప్లాన్ చేసిన పాకిస్తాన్‌‌కు చెందిన జైష్-ఏ-మహ్మద్ సంస్థ కుట్రను భద్రతా దళాలు అడ్డుకున్నాయని ప్రధాని మోడీ అన్నారు. గురువారం నగ్రోటాలో సెక్యూరిటీ ఫోర్సెస్ జరిపిన ఎన్‌‌కౌంటర్‌‌లో నలుగురు జైషే గ్రూప్ టెర్రిస్టులు మృతి చెందారు. వీరిని చంపడం ద్వారా భారీ అటాక్‌‌ను భద్రతా దళాలు విఫలం చేశాయని మోడీ మెచ్చుకున్నారు. సదరు టెర్రరిస్టుల వద్ద భారీ స్థాయిలో ఆయుధాలు, పేలుడు సామాగ్రి ఉండటం.. పెద్ద అటాక్‌‌కు ప్లాన్ చేసినట్లుగా సూచిస్తోందని మోడీ పేర్కొన్నారు.

‘మన సెక్యూరిటీ ఫోర్సెస్ మరోసారి తమ ధైర్య, సాహసాలు, ప్రొఫెషనలిజంను చాటారు. వారు అనుక్షణం అప్రమత్తతతో వ్యవహరించడంతో ఇది సాధ్యమైంది. జమ్మూ కశ్మీర్‌‌లో అట్టడుగు స్థాయి నుంచి ప్రజాస్వామ్యాన్ని టార్గెట్‌‌గా చేసుకొని పన్నిన దుర్మార్గపు కుట్రను సైనికులు విజయవంతంగా జయించారు’ అని మోడీ వివరించారు.