
నల్లగొండ: రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెలంగాణలో తొలి భూపోరాటానికి నాంది పలికిన చాకలి ఐలమ్మ 130వ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది.
జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన జయంతి ఉత్సవాల్లో భాగంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో నాగర్జున సాగర్ రోడ్ లో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు నివాళులర్పించారు కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. తెలంగాణలో తొలి భూ పోరాటానికి నాంది పలికిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడరు.
►ALSO READ | తెలంగాణకు భారీ వర్ష సూచన.. వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్.. మరో 14 జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు
ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చోల్లేటి ప్రభాకర్, ఇంఛార్జీ డిఆర్ఓ వై అశోక్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ,ఇంచార్జి బీసీ సంక్షేమ అధికారి రాజ్ కుమార్, బీసీ సంఘాల ప్రతినిధులు కొండూరు సత్యనారాయణ, రామరాజు, ఆమంచిఅంజయ్య, సట్టు రాములు పాల్గొన్నారు.