నల్లగొండ సీపీఐలో ముసలం

నల్లగొండ సీపీఐలో ముసలం

ఉమ్మడి నల్లగొండ జిల్లా సీపీఐలో ముసలం మొదలైంది. నవంబర్ 30న జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు సిపిఐ(ఎం)కు కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదిరిన విషయం తెలిసిందే. అయితే  సిపిఐ.. కొత్తగూడెం, మునుగోడు సీట్లను కోరగా, కాంగ్రెస్ మాత్రం రెండింట్లో ఏదో ఒకటి మాత్రమే ఇచ్చేందుకు ఒప్పుకుందని.. దాంతో సిపిఐ కొత్తగూడెం సీటును కోరినట్లు తెలుస్తోంది. అయితే,  మునుగోడు సీటు వదులుకోవడంపై  నల్గొండ సీపీఐ నేతలు భగ్గుమంటున్నారు. కొత్తగూడెం కోసం మునుగోడును వదిలేశారనే విమర్శలు తలెత్తుతున్నాయి. 

Also Read :- గుండెపోటుతో ఏడో తరగతి విద్యార్థిని మృతి

 కమ్మ నేత కోసం బీసీ నేతను బలి పశువు చేశారంటున్న  సీపీఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   కొత్తగూడెం సీటు కోసం  పార్టీ  ముఖ్య నేతలు బిఆర్ఎస్ తో పొత్తును విభేదించారంటూ క్యాడర్ లో చర్చ జరుగుతోంది. ఒక్కో ఎన్నికల్లో ఒక్కో నిర్ణయాలు పార్టీకి మంచిది కాదు అంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ.. నల్గొండ జిల్లాలో సొంతంగా పోటీ చేస్తామని నారాయణ, కూనంనేనికి నల్గొండ సీపీఐ నేతలు తేల్చి చెప్పారు.  త్వరలో సిపిఐ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి  మునుగోడు నియోజకవర్గంలో సిపిఐ పోటీ చేయాలా? లేదా? అనే అంశంపై, అభ్యర్థి ఎంపికపై చర్చించనున్నట్లు జిల్లా సిపిఐ నేతలు తెలిపారు.