గంజాయి ముఠా అరెస్ట్.. కటకటాల్లోకి నిందితులు

గంజాయి ముఠా అరెస్ట్.. కటకటాల్లోకి నిందితులు

అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టి.. నిందితులను పట్టుకున్నామని జిల్లా ఎస్పీ కే.అపూర్వ రావు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 43 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని వివరించారు.

గుట్టు చప్పుడు కాకుండా గంజాయిని తరలిస్తున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒక మహిళ కూడా ఉంది. నిందితుల నుంచి 103 కిలోల గంజాయి, 5 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి ప్యాకెట్ల విలువ సుమారు రూ. 10 లక్షల వరకూ ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ కేసును చేధించిన టాస్క్ ఫోర్స్,  కేతపల్లి పోలీసులకు అభినందనలు తెలియజేశారు.

ఇతర రాష్ట్రాల నుంచి ఎన్‌హెచ్ 65పై ప్రయాణిస్తున్న వాహనాలను ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ సమయంలో కొర్లపాడ్ టోల్ గేట్ వద్ద అనుమానం వచ్చిన వాహనాలను తమ టీమ్ సభ్యులు తనిఖీలు చేస్తున్నారని, ఇందులో భాగంగానే నిందితులు పట్టుబడ్డారని ఎస్పీ కే.అపూర్వరావు చెప్పారు.

ఒరిస్సా‌కు చెందిన గంజాయి వ్యాపారం చేసే వినయ్ అనే వ్యక్తి ద్వారా గంజాయిని హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు నిందితులు పోలీసుల విచారణలో అంగీకరించారు. వినయ్ కు తెలిసిన వ్యక్తి వివేక్ వద్ద నుంచి సరఫరా చేస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారని, వారిలో ఒక్కొక్కరికి రూ. 10,000 నిర్వాహకులు ఇచ్చినట్లు ముఠా సభ్యులు తెలిపారని పోలీసులు వెల్లడించారు. గంజాయి తరలించే వాళ్లంతా కూలీలుగా గుర్తించారు.