రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు

రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు

రైతులకు అన్యాయం జరగకుండా చర్యలు చేపడుతామన్నారు నల్గొండ పోలీసులు. రైతులను మోసం చేస్తే కఠిన  చర్యలు తప్పవని మిల్లర్లను హెచ్చరించారు.   ధాన్యం కొనుగోళ్ల విషయంలో  తూకంలో మోసాలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామన్నారు.  రైస్  మిల్లులు, కొనుగోలు కేంద్రాలను తనిఖీ  చేయడానికి సంబంధిత అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. తేమ శాతం , తాలు, తరుగు పేరుతో మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.