
నమీబియా నుంచి తీసుకొచ్చిన చిరుతల్లో ఒకటైన ఆశా కునో నేషనల్ పార్క్‌లో 4 పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ప్రకటించారు. 2022 సెప్టెంబర్ 17న ఇండియాకుల వచ్చిన ఓ చీతాకు నాలుగు పిల్లలు పుట్టాయని చెప్పేందుకు సంతోషిస్తున్నాను. గతంలో జరిగిన పర్యావరణపరమైన తప్పులను సరిదిద్దతూ చీతాలను భారత్ కు తిరిగి తీసుకురావడంలో కృషి చేస్తోన్న బృందాన్ని అభినందిస్తు్న్నానని ట్వీట్ చేశారు.
https://twitter.com/byadavbjp/status/1640989652239925249
మరోవైపు నమీబియా చిరుతల్లో ఒకటైన సాషా మృతి చెందింది. గత ఏడాది నమీబియా నుంచి తీసుకువచ్చి కునో నేషనల్ పార్క్‌లో ప్రవేశపెట్టిన ఎనిమిది చిరుతల్లో ఒకటైన సాషా మార్చి 27న మరణించింది. సాషా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నట్లుగా అధికారులు తెలిపారు. సాషాను భారత్‌కు తీసుకురాకముందే అనారోగ్యంతో బాధపడుతోందని అధికారులు వెల్లడించారు. పార్క్‌లోని ఇతర చిరుతలు ఆరోగ్యంగా ఉన్నాయని తెలిపారు. సెప్టెంబరు 17న కునోలో ప్రధాని మోడీ విడుదల చేసిన ఐదేళ్ల వయసున్న రెండు ఆడ పెద్ద పిల్లులలో సాషా చిరుత ఒకటి.