
జగిత్యాల జిల్లాలో వింత సంఘటన చోటుచేసుకుంది. రాయికల్ మండలంలోని రామోజీపేట్ గ్రామంలో వేల్పుల సరిత, స్వామి యాదవ్ దంపతులు ఇంట్లో ఒక కుక్కను పెంచుకుంటున్నారు. అది నవంబర్ 20న ప్రసవించింది. నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఇవాళ్టికి 21వ రోజు కావడంతో ఆ శునకానికి పురుడు చేసి.. కుక్క పిల్లలకు నామకరణోత్సవం చేశారు.
ఇందులో భాగంగా పిల్ల శునకాలకు కొత్త బట్టలు, కుల్లలు తొడిగారు. అందంగా అలంకరించి వాటికి నామకరణం చేశారు. అంతేకాదు చుట్టుపక్కల వారిని పిలిచి అన్నదానం చేశారు. భారతీయ సనాతన హైందవ ధర్మంలో అందరిలో గోవిందుడిని కాంచే తత్వం ఉందని, ఇది ప్రపంచానికే ఆదర్శమని సరిత,స్వామి అన్నారు.