కొత్త టాలెంట్‌‌‌‌‌‌‌‌కు స్నేహ హస్తం

కొత్త టాలెంట్‌‌‌‌‌‌‌‌కు స్నేహ హస్తం

అవ‌‌‌‌‌‌‌‌కాశాల కోసం ఎదురు చూస్తున్న కొత్త నటీనటులు, టెక్నీషియన్స్‌‌‌‌‌‌‌‌ కోసం నన్బన్‌‌‌‌‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్మెంట్స్‌‌‌‌‌‌‌‌ అనే చిత్ర నిర్మాణ సంస్థను ఇటీవల చెన్నైలో ప్రారంభించారు. ఈ ఈవెంట్​లో తమన్నా డాన్స్ స్పెషల్ అట్రాక్షన్‌‌‌‌‌‌‌‌గా నిలిచింది. చీఫ్ గెస్ట్ నాజర్ మాట్లాడుతూ ‘ప్రపంచంలో స్నేహం అనేది గొప్ప బంధం. అలాంటి ఒక మంచి కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌తో ఈ సంస్థను ప్రారంభించిన నన్బన్‌‌‌‌‌‌‌‌ గ్రూపును అభినందిస్తున్నా’ అన్నారు. 

గ్రూపు ఫౌండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గోపాల కృష్ణన్ మాట్లాడుతూ ‘నన్బన్‌‌‌‌‌‌‌‌ అంటే స్నేహితుడు అని అర్థం. స్నేహంలోని గొప్పతనాన్ని చాటుతూ, టాలెంట్ ఉండి ఇబ్బందులు పడేవారికి అండగా ఈ సంస్థను తీసుకొస్తున్నాం. తమిళంతో  పాటు ఇతర సినిమా ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌పై కూడా ఫోకస్ పెడుతున్నాం’ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సంస్థ బ్రాండ్ అంబాసిడ‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌ ఆరి అర్జున‌‌‌‌‌‌‌‌న్, గ్రూప్ హెడ్ న‌‌‌‌‌‌‌‌రైన్ రామ‌‌‌‌‌‌‌‌స్వామి, డీవోపీ పి.సి.శ్రీరామ్, డైరెక్టర్ చేరన్, రచయిత అరివుమది తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.