ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణల్లో నిజం లేదు : నందకుమార్‌‌

ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణల్లో నిజం లేదు : నందకుమార్‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: పూజల కోసమే పైలెట్‌‌‌‌ రోహిత్‌‌‌‌ రెడ్డి ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌కు తాము వెళ్లామని నందకుమార్‌‌‌‌ తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశం నిజం కాదని చెప్పారు. తమపై రోహిత్‌‌‌‌ రెడ్డి ఫిర్యాదు చేసినట్టుa తెలియదన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నందకుమార్‌‌‌‌తో పాటు రామచంద్ర భారతి, సింహయాజీల జ్యూడీషియల్‌‌‌‌ రిమాండ్‌‌‌‌కు ఏసీబీ కోర్టు నిరాకరించిన తర్వాత (గురువారం రాత్రి) నందకుమార్‌‌‌‌ మీడియాతో మాట్లాడారు.

సింహయాజీ స్వామిజీతో సామ్రాజ్య లక్ష్మీ పూజలు చేయించడానికే ఫామ్‌‌‌‌ హౌస్‌‌‌‌కు వెళ్లామని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఇదంతా చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు స్కాం ఎక్కడిదని, అసలు ఏ స్కాం అనేది తమకు తెలియదన్నారు. తాము న్యాయస్థానాలను నమ్ముతామని, కోర్టులో న్యాయమే జరిగిందని, త్వరలోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు.