బాలయ్య కెరీర్‌‌లో స్పెషల్ డే.. ఫ్యాన్స్ విషెస్

బాలయ్య కెరీర్‌‌లో స్పెషల్ డే.. ఫ్యాన్స్ విషెస్

హైదరాబాద్​: నందమూరి నటసింహం బాలకృష్ణ కెరీర్‌‌లో ఆదివారం స్పెషల్ డేగా చెప్పొచ్చు. చైల్డ్ యాక్టర్‌‌గా 1974, ఆగస్టు 30న తాతామ్మ కల మూవీతో బాలయ్య ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇవాళ్టితో ఆయన సినీ కెరీర్‌‌లో 46 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా బాలయ్యకు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులతోపాటు ఫ్యాన్స్ కూడా విషెస్ చెబుతున్నారు. నాలుగున్నర దశాబ్దాలుగా బాలయ్య తన నటన, డ్యాన్సులు, అదిరిపోయే డైలాగ్ డెలివరీతో తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశాడు. లెంగ్తీ డెలివరీలు చెప్పడంలో బాలయ్యది అందెవేసిన చేయి. ఆయనకు మాస్‌లో ప్రత్యేక ఇమేజ్ ఉంది. ప్రస్తుతం బోయపాటి డైరెక్షన్‌లో ఓ మూవీలో నటిస్తున్న బాలయ్య.. మరికొన్ని ప్రాజెక్టులను ఓకే చేసే పనిలో ఉన్నాడు.