NBK 109: బాలకృష్ణ 109లో మరో విజ్జీ పాప..తెలుగమ్మాయి అందం వెరీ స్పెషల్

NBK 109: బాలకృష్ణ 109లో మరో విజ్జీ పాప..తెలుగమ్మాయి అందం వెరీ స్పెషల్

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నెక్స్ట్ ఫిల్మ్ (NBK109) ని బాబీ డైరెక్షన్లో చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు కూడా చాలా విభిన్నమైన యాక్షన్..ఎమోషన్తో పాటు సోషల్ మెసేజ్ను టచ్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ మూవీని నిర్మాత నాగ వంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫార్చూన్ త్రివిక్రమ్ ఫోర్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రొడక్షన్ టీమ్ తోనే మేకర్స్ ఈ సినిమాపై బుజ్ క్రియేట్ చేశారు. 

అంతేకాకుండా..ఈ ప్రాజెక్టులో మరో ముఖ్యమైన పాత్ర కోసం ఒక యంగ్ హీరో కూడా నటిస్తున్నాడు.మన తెలుగు వాళ్లకి సీతారాముడిగా..ఎంతో సుపరిచుతులైన మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(DulquarSalman)ను రంగంలోకి దింపుతున్నాడు బాబీ.

అలాగే ఈ సినిమాలో భగవంత్ కేసరిలో మాదిరిగా విజ్జి పాప లాంటి క్యారెక్టర్ ఒకటి డిజైన్ చేశారట బాబీ. అంతేకాదు..ఈ సినిమాకు ఆ పాత్ర ఎంతో కీలకంగా ఉండబోతుందంట. ఇప్పుడు ఆ క్యారెక్టర్ కోసం తెలుగు బ్యూటీని రంగంలోకి దింపుతున్నారట మేకర్స్. అందుకు సమ్మతమే బ్యూటీ చాందిని చౌదరిని (Chandini Chowdary) నటింపజేసేందుకు చర్చలు జరిగినట్లు సమాచారం.

అయితే ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న లీక్ ప్రకారం.. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ కి జోడీగా చాందిని కనిపించబోతుందట.త్వరలో ఇదే విషయంపై మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నారు. బాలయ్య వంటి  స్టార్ హీరో సినిమాలో అవకాశం వచ్చిందంటూ చాందినీ తన సన్నిహితుల దగ్గర ప్రస్తావించినట్లు టాక్ వినిపిస్తోంది.  

కలర్ ఫోటో మూవీతో ఆడియన్స్ దగ్గరైన ఈ తెలుగు అందం..వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం విశ్వక్ గామి మూవీలో నటించగా..ఈ సినిమా శివరాత్రి సందర్బంగా రిలీజ్ కానుంది.