నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త సినిమా లెటెస్ట్ అప్ డేట్

నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త సినిమా  లెటెస్ట్ అప్ డేట్

వైవిధ్యమైన పాత్రలతో గుర్తింపు సంపాదించుకున్న నటుల్లో నందమూరి కథానాయకుడు.. డైనమిక్ స్టార్ నందమూరి కళ్యాణ్ ఒకరు. రీసెంట్‌గా విడుద‌లైన ‘బింబిసార’ చిత్రంతో సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్టర్ ను సాధించారు. తాజాగా రామ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతోంది. నందమూరి కళ్యాణ్ రామ్ కు ఇది19వ చిత్రం. రాజేంద్ర రెడ్డి ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రాన్ని న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్ నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసిన చిత్ర బృందం లెటెస్ట్ అప్ డేట్ అందించింది. సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ ను సోమవారం ఉదయం 10.08 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. ఇది చూసిన నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. క‌ళ్యాణ్ రామ్ స‌ర‌స‌న ఆషిక రంగ‌నాథ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. జిబ్రాన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎస్‌.సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేశారు. 

న‌టీన‌టులు : నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌, ఆషిక రంగ‌నాథ్‌, బ్రహ్మాజి, సప్తగిరి, జ‌య‌ ప్రకాష్ మాథ్యూ వ‌ర్గీస్‌, రాజీవ్ పిళ్లై, ర‌వి ప్రకాష్, శివ‌న్నారాయ‌ణ‌, చైత‌న్య కృష్ణ, ర‌ఘు కారుమంచి, మాణిక్ రెడ్డి, గబ్బర్ సింగ్ సాయి, శ్రీధ‌ర్‌, అశోకన్‌ విన్సెంట్, క‌ళ్యాణి న‌ట‌రాజ‌న్‌, రాజ‌శ్రీ నాయ‌ర్‌, సోనాక్షి వ‌ర్మ.