ఆలయ పూజారికి నంది పురస్కారం

ఆలయ పూజారికి నంది పురస్కారం

ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం ఇందిరానగర్ గ్రామంలోని కనక దుర్గాదేవి స్వయంభూ శ్రీ మహంకాళి దేవస్థానం ఆలయ అర్చకుడు దేవర వినోద్ ను శిఖర సంస్థ నంది అవార్డుతో సత్కరించింది. 8 ఏండ్లుగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న దేవర వినోద్.. కరోనా సమయంలోనూ పేదలకు నిత్యావసరాలు  అందించారు. ఆయన సేవలను గుర్తించిన శిఖర ఆర్ట్స్ సంస్థ హైదరాబాద్​లోని రవీంద్ర భారతిలో సామాజిక సేవ,  ఆధ్యాత్మిక రంగం నుంచి 2024కు గానూ నంది పురస్కారం అందించింది.