
నిర్మాతగా వరుస సినిమాలను అనౌన్స్ చేసిన రానా.. మరోవైపు నటుడిగానూ మరింత బిజీ అవబోతున్నాడు. ఇప్పటికే ‘హిరణ్య కశ్యప’ అనే సినిమాను అనౌన్స్ చేశాడు. అది సెట్స్ పైకి వెళ్లడానికి ముందే మరో సినిమాకి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. రజినీకాంత్ హీరోగా ‘జై భీమ్’ ఫేమ్ టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతోంది. లైకా ప్రొడక్షన్స్ దీన్ని నిర్మించనుంది.
తలైవర్ కెరీర్‌లో ఇది 170వ చిత్రం. ఈ చిత్రంలో రానా కీలకపాత్రలో నటించబోతున్నాడట. అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, మంజు వారియర్ లాంటి భారీ స్టార్ కాస్ట్ ఇప్పటికే ఇందులో నటిస్తోంది. ఇప్పుడు రానా కూడా ఈ వరుసలో చేరబోతున్నాడు. ఈ పాత్ర కోసం శర్వానంద్, నానిలను సంప్రదించినట్టు ఇటీవల వార్తలొచ్చాయి. రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్‌గా నటించే ఈ ఇంటెన్స్ డ్రామా ఈ నెల మూడో వారంలో చెన్నైలో ప్రారంభం కాబోతోంది. ఈలోపు నటీనటుల పేర్లను అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తారేమో చూడాలి!