సరిపోయిందా శనివారం మొదలైంది

సరిపోయిందా శనివారం మొదలైంది

మరో ఇరవై రోజుల్లో ‘హాయ్ నాన్న’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నాని.. తాజాగా  తన నెక్స్ట్‌‌ ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘సరిపోయిందా శనివారం’ సినిమాలో నటిస్తున్నాడు నాని. దసరా సందర్భంగా  పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌‌ను మంగళవారం నుంచి మొదలుపెట్టారు. యాక్షన్ ఎపిసోడ్‌‌తో హైదరాబాద్‌‌లో షూట్‌‌ను స్టార్ట్ చేసినట్టు మేకర్స్ తెలియజేశారు.  

రామ్ -లక్ష్మణ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో హైవోల్టేజ్ ఎపిసోడ్‌‌ తీస్తున్నారు. ఈ షెడ్యూల్‌‌లో యాక్షన్‌‌తో పాటు కొన్ని టాకీ పార్ట్‌‌లను కూడా చిత్రీకరించనున్నారు. నానితో పాటు సినిమాలోని ప్రధాన ఆర్టిస్టులు షూటింగ్‌‌లో భాగం కానున్నారు. ఇందులో నాని రగ్డ్  లుక్‌‌లో కనిపించనున్నాడు. ప్రియాంక అరుళ్ మోహన్‌‌ హీరోయిన్‌‌గా నటిస్తోంది. ఎస్‌‌జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నాడు.   డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి కలిసి భారీ బడ్జెట్‌‌తో దీన్ని నిర్మిస్తున్నారు.  జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు.