
నేచురల్ స్టార్ నాని(Nani) తను ఎంచుకునే కథల విషయంలో ఎప్పటికప్పుడు ప్రత్యేకత చాటుతూ ఉంటారు. అలా ప్రతి మూవీలను ఒక ఎమోషన్ క్యారీ చేస్తూ.. అందరినీ తన నటనతో ఆకట్టుకుంటారు. రీసెంట్ గా నాని30వ మూవీ హాయ్ నాన్న(Hi Nanna) నుంచి ఫస్ట్ సింగిల్ సమయం సాంగ్ తో ఆడియాన్స్ ఆకట్టుకున్న నాని..త్వరలో రెండో పాటను రిలీజ్ చేయనున్నారు.
లేటెస్ట్ గా ఈ సెకండ్ సాంగ్ అప్డేట్ ఇవ్వడంలో నాని చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తు ఉన్న వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోను చూస్తుంటే ఆడియన్స్ ను తన ప్రమోషన్స్ తో డిఫరెంట్ గా ఆకట్టుకుంటున్నట్లు తెలుస్తుంది. తన కూతురు..చిన్నారి పాపతో కిచెన్ లో పనిచేసుకుంటూ ఉన్న ఒక వీడియోలో..ఆ చిన్నారి లవ్ స్టోరీ సాంగ్ రిలీజ్ చేశావు..మరి మన సాంగ్ లేదా నాన్న అంటూ క్యూట్ గా అడిగే ఈ వీడియో మెస్మరైజ్ చేస్తుంది. ఆ తర్వాత నాని కూడా క్యూట్ హవా భావాలతో.. మన సాంగ్ హా..ఉంటుంది. నా గాజు బొమ్మ అంటూ ఎమోషన్ తో హత్తుకునే వీడియో స్పెషల్ గా ఆకట్టుకుంటుంది.
హేశం అబ్దుల్(Heshamabdulwahab) మ్యూజిక్ వేరే లెవెల్లో ఉండబోతోందనే విషయం బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన బీజీమ్ తో అర్ధం అవుతుంది. గాజుబొమ్మ సాంగ్ ను అక్టోబర్ 6న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. రీసెంట్గా హేషామ్ అబ్దుల్ అందించిన ఖుషి మూవీ సాంగ్స్కు ఆడియన్స్ నుంచి కేజ్రీ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. హాయ్ నాన్నతో మరో హిట్ ఆల్బమ్ ఇవ్వడం..కన్ఫమ్ అంటున్నారు ఆడియన్స్.
ALSO READ: తలైవర్170 లో రానా, ఫహద్ ఫాజిల్.. క్యారెక్టర్స్ ఏంటంటే?
హాయ్ నాన్న నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్లుక్ పోస్టర్, గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని శౌర్యువ్ అనే కొత్త దర్శకుడి తెరకెక్కిస్తున్నారు.
కాగా హాయ్ నాన్న మూవీ వైరా ఎంటర్ టైన్‌మెంట్స్ (Vyraentertainments) బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, విజయేందర్‌రెడ్డి తీగల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తండ్రీ కూతుళ్ల ఎమోషనల్ జర్నీ నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీ..తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
To every father ♥️
— Nani (@NameisNani) October 3, 2023
This one will be special …#HiNanna #GaajuBomma pic.twitter.com/NfnKX7hbrq