
జైలర్ సక్సెస్తో రజినీ కాంత్(Rajinikanth) తన నెక్స్ట్ మూవీపై ఫోకస్ పెట్టాడు. తలైవర్170 (Thalaivar170) గా వస్తోన్న ఈ మూవీని జైభీమ్ ఫేం డైరెక్టర్ టీజే జ్ఞానవేల్(Tj Gnanavel) ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. లేటెస్ట్గా ఈ మూవీ నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీలో చాలా కీలకమైన రోల్స్ కోసం టాలీవుడ్ హల్క్, స్టార్ యాక్టర్ దగ్గుబాటి రానా(Rana Daggubati), మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్(Fahadh Fazil) ఈ క్రేజీ ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యారంటూ లైకా ప్రొడక్షన్స్ ట్వీట్ చేసింది.
సూపర్ కూల్ టాలెంట్ దగ్గుబాటి రానాకు..రజినీ తలైవర్ 170లోకి స్వాగతం. డ్యాషింగ్ హీరో రానా రాకతో తలైవర్ 170 మరింత ఆకర్షణీయంగా, గంభీరంగా మారింది.. అలాగే విక్రమ్,పుష్ప ఇలా ఎన్నో డిఫరెంట్ క్యారెక్టర్స్తో నేషనల్ వైడ్గా గుర్తింపు తెచ్చుకున్న ఫాహద్ ఫాసిల్కు స్వాగతం అంటూ ట్వీట్ చేశారు మేకర్స్.
ALSO READ: హాయ్ నాన్నసెకండ్ సింగిల్ అప్డేట్..స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన నాని
రానా, ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్స్ తలైవర్170 లో ఎలా ఉండబోతాయని ఇంకా ప్రకటించకపోయినప్పటికీ..వీరి రాకతో మరింత బజ్ క్రీయేట్ అయ్యింది. రానా విలన్ గా చేస్తున్నాడా? లేక రజినీ సహచరుడి పాత్ర పోషిస్తున్నాడా అనేది సస్పెన్స్ గా మారింది.
ఇప్పటికే, ఈ మూవీలో బిగ్ బి అమితా బ్తో పాటు, దుషారా విజయన్, రితికా సింగ్, మంజు వారియర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీంతో తలైవర్ 170 ఎలా ఉండబోతుందో అర్ధం చేసుకోవొచ్చు. జై భీమ్ మూవీతో దేశ వ్యాప్తంగా ప్రశంసలు పొందిన డైరెక్టర్ జ్ఞాన వేల్ తలైవర్ 170 కోసం భారీ ప్లాన్ చేసినట్లు కోలీవుడ్ టాక్. ఈ మూవీలో రజినీ పోలీస్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. కొన్ని యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీ త్వరలో షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నా ఈ మూవీ వచ్చే ఏడాది 2024 లో రిలీజ్ కానుంది.
Welcoming the dapper & supercool talent ? Mr. Rana Daggubati ✨ on board for #Thalaivar170??#Thalaivar170Team has gotten even more charismatic ? with the addition of the dashing @RanaDaggubati ??✌?@rajinikanth @tjgnan @anirudhofficial @ManjuWarrier4 @officialdushara… pic.twitter.com/XhnDpm27CH
— Lyca Productions (@LycaProductions) October 3, 2023
Welcoming the incredibly versatile talent ? Mr. Fahadh Faasil ✨ on board for #Thalaivar170??#Thalaivar170Team gains a powerful new addition with the astonishing performer ? #FahadhFaasil joining them. ???@rajinikanth @tjgnan @anirudhofficial @RanaDaggubati… pic.twitter.com/cOYwaKqbAL
— Lyca Productions (@LycaProductions) October 3, 2023