
నేచురల్ స్టార్ నాని(Nani) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram). దర్శకుడు వివేక్ ఆత్రేయ(Vivek Athreya) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక మొహనన్ (Priyanka Mohanan) హీరోయిన్ గా నటిస్తున్నారు. దీవీవీ దానయ్య(DVV Danayya) నిర్మిస్తున్న ఈ సినిమాలో తమిళ నటుడు SJ సూర్య కీ రోల్ చేస్తున్నారు. మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తున్న సరిపోదా శనివారం సినిమా ఆగస్టు 29న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలో మేకర్స్ వరుస ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమాకు సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ లాక్ చేశారు మేకర్స్. సరిపోదా శనివారం చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం ఆగష్టు 24న జరగనుంది. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత దానయ్య డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ తన ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటించింది. అయితే ఈ కార్యక్రమం ప్లేస్ ఎక్కడ జరుగుతుందనే వివరాలు మాత్రం ప్రకటించలేదు.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ఈవెంట్ హైదరాబాద్‌లోనే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం డీవివి దానయ్య నిర్మాణంలో తెరకెక్కనున్న OG సినిమాలో పవన్ నటిస్తున్న విషయం తెలిసిందే. త్వరలో మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
#SaripodhaaSanivaaram Pre Release Event on AUGUST 24th ????
— DVV Entertainment (@DVVMovies) August 21, 2024
ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన సాంగ్స్, విజువల్స్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. పోలీస్ ఆఫీసర్‌కు, ఒక కామన్ మ్యాన్‌కు మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో యాక్షన్ అంశాలతో రిలీజ్ చేసిన వీడియో గ్లింప్స్ ఆకట్టుకుంది. భాగవతం కథతో నాని వాయిస్ ఓవర్ ద్వారా ఎస్‌జే సూర్య పాత్రను పరిచయం చేయడం చాలా కొత్తగా ఉంది.
కోపం అనేది ఒక్కో మనిషిలో ఒక్కో రకంగా ఉంటుంది. కానీ, ఆ కోపాన్ని కూడా క్రమబద్ధంగా, పద్దతిగా వారంలో ఒక్కరోజు మాత్రమే చూపించే పిచ్చినా కొడుకుని ఎవరైనా చూశారా? నేను చూశా. వాడి పేరు సూర్య. మరి సినిమా రిలీజ్ అయ్యాక ఏ రేంజ్ లో వీరి మధ్య పోరాటం సాగనుందో చూడాలి.