TheParadise: నాని సినిమాలకు భారీ డిమాండ్.. రికార్డు రేటుకు ది ప్యారడైజ్ ఆడియో హక్కులు!

TheParadise: నాని సినిమాలకు భారీ డిమాండ్.. రికార్డు రేటుకు ది ప్యారడైజ్ ఆడియో హక్కులు!

నేచురల్ స్టార్ నాని వరుస సక్సెస్ లతో జోష్ మీదున్నాడు. వరుసగా రూ.100 కోట్ల కలెక్షన్ల మూవీస్ అందిస్తున్నారు. దసరా, సరిపోదా శనివారం, హిట్ 3 వంటి మూవీస్ తో వందకోట్ల రేంజ్ హీరోగా ఎదిగాడు నాని.

ఈ క్రమంలోనే తన స్టార్ డం పడిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ.. కాన్సెప్ట్  ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అందులో ముందువరుసలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ 'ది ప్యారడైజ్'. ఇందులో నాని క్యారెక్ట‌ర్ మునుపెన్న‌డూ చూడ‌ని విధంగా స‌రికొత్తగా ఉంది. రెండు జాడలు వేసుకుని, రా అండ్ రస్టిక్ లుక్లో భిన్నంగా ఉన్నాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని చేరాయి.

Also Read : పెద్ది ఐటమ్ భామ ఫిక్స్

ఈ క్రమంలో ది ప్యారడైజ్ మూవీ ఆడియో హక్కులకు భారీ ధర పలికినట్లు సమాచారం. ప్యారడైజ్ ఆడియో రైట్స్ కోసం పలు పాపులర్ సంస్థలు పోటీ పడ్డాయి. భారీ డిమాండ్ చూపిన కొనడానికి సై అంటూ ముందుకొచ్చాయి. ఇక చివరికి ఈ మూవీ హక్కులు సరిగమ కంపెనీ సొంతం చేసుకుందని టాక్. ఏకంగా రూ.18 కోట్లు చెల్లించి మరీ ఆడియో రైట్స్ కొనుగోలు చేసిందని తెలుస్తోంది. అయితే, నాని వరుస సక్సెస్ల దృష్ట్యా అతని సినిమాలకు భారీ బిజినెస్ జరుగుతోంది. రిలీజ్కు ముందే లాభాల్లో చేరిపోతున్నాయి.

ఇదిలా ఉంటే.. ఈ మూవీ 2026 మార్చి 26న 8 భాషల్లో రానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ మరియు స్పానిష్ భాషల్లో 
గ్రాండ్గా విడుదల చేస్తున్నారు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే మార్చి 26, 'గురువారం' రోజు వస్తోంది. అయితే, నాని గురువారం సెంటిమెంట్ అసలు ఏ మాత్రం వదలడం లేదు.

గత సినిమాలు చూసుకుంటే నాని కెరీర్లో బిగెస్ట్ హిట్గా నిలిచిన 'దసరా' మూవీ 2023 మార్చి 30న గురువారం రోజు రిలీజ్ అయింది. ఇక ఆ తర్వాత 'హాయ్ నాన్న' మూవీ 2023 డిసెంబర్ 7న గురువారం రోజున, అలాగే 'సరిపోదా శనివారం' 2024 ఆగస్టు 29న గురువారం రిలీజ్ అయ్యాయి.

ఇక ఇప్పుడు 'హిట్ 3' మూవీని 2025 మే 1న గురువారం.. 'ది ప్యారడైజ్' చిత్రాన్ని 2026 మార్చి 26న గురువారం రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇలా తన చిత్రాలను గురువారం రోజున రిలీజ్ చేస్తూ.. బ్లాక్ బాస్టర్ హిట్స్ అందుకుంటున్నాడు నాని. ఇప్పుడు తన రాబోయే సినిమాలను కూడా అదే సెంటిమెంట్ తో రిలీజ్ చేస్తూ దుమ్ములేపేందుకు రెడీ అవుతున్నాడు.

ఇకపోతే, ఈ సినిమాకి డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ సినీ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. తమిళ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.